ఓ క్రిమినల్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి పుట్టిన సినిమానే జిగర్తాండ. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా కోలీవుడ్ లో బిగ్ హిట్ అయ్యింది. ఇదే సినిమాను తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ గద్దల కొండ గణేష్ పేరుతో తెరకెక్కించాడు. ఈ సినిమా ఇక్కడ ఫ్లాప్ అయ్యింది.

జిగర్తాండ సినిమాకు సీక్వెల్ గా జిగర్తాండ డబుల్ ఎక్స్ రూపొందుతోంది. ఇవాళ ఈ సినిమా టీజర్ ను మహేశ్ బాబు రిలీజ్ చేశారు. ఓ గ్యాంగ్ స్టర్ తన బయోపిక్ తో సినిమా చేయమని చెప్పడం, అలాగే మూవీ క్రైమ్ సీన్స్ తో , అదిరే యాక్షన్ తో రూపొందించడం ఆసక్తికరంగా అనిపించింది. 1975 బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడంతో టీజర్ మొత్తం రెట్రో స్టైల్ లో ఉంది.

గ్యాంగ్ స్టర్ బయోపిక్ తీసే డైరెక్టర్ గా ఎస్ జే సూర్య, గ్యాంగ్ స్టర్ గా లారెన్స్ కనిపించారు. లారెన్స్ క్యారెక్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ దీపావళికి జిగర్తాండ డబుల్ ఎక్స్ రిలీజ్ కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *