పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారాలతో ఆయన సినిమా షూటింగ్స్ కు అంతరాయం ఏర్పడుతోంది. ఆయన పొలిటికల్ టూర్స్ తో సినిమా షెడ్యూల్స్ గందరగోళంలో పడుతున్నాయి. ఒక షెడ్యూల్ కు ఆర్టిస్టుల డేట్స్ సెట్ చేసుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. అలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత సడెన్ గా వచ్చి పడే పొలిటికల్ హ్యాపెనింగ్స్ వల్ల సదరు షూటింగ్స్ కు పవన్ వెళ్లలేకపోతున్నారు.

పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరి హర వీరమల్లు రెగ్యులర్ షూటింగ్ లో ఉన్నాయి. వీటిలో ఉస్తాద్, హరి హరకు ఈ నెలలోనే డేట్స్ ఇచ్చారట పవన్. అయితే వాళ్లు షూటింగ్స్ కు సన్నాహాలు చేసుకునేలోపు ఏపీలో చంద్రబాబు అరెస్ట్ వంటి బ్రేకింగ్స్ జరిగాయి. దీంతో పవన్ ఏపీకి వెళ్లారు. దీంతో ఇక్కడ షూటింగ్స్ పై ఖచ్చితంగా ఏమీ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

హరి హర వీరమల్లు సినిమా పవన్ పొలిటికల్ జర్నీ వల్ల బాగా ఇంపాక్ట్ అవుతోంది. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ పవన్ లేని సీన్స్ అన్నీ షూటింగ్ చేస్తున్నారు. పవన్ కోసం ఆగితే షెడ్యూల్స్ సమయం వృథా అవుతుందని హరీశ్ ఈ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఓజీ టీమ్ కూడా పవన్ సెట్స్ లోకి ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *