సన్నీ డియోల్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గదర్ 2 బాక్సాఫీస్ రికార్డ్స్ కొల్లగొడుతూనే ఉంది. ఈ సినిమా వసూళ్ల దెబ్బకు ఇప్పుడున్న బాక్సాఫీస్ రికార్డులన్నీ వెనకబడుతున్నాయి. ఇప్పటికే దంగల్ రికార్డ్ దాటేసిన ఈ సినిమా తాజాగా బాహుబలి 2 హిందీ కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. బాహుబలి 2 హిందీలో 510 కోట్ల రూపాయల వసూలు చేసి బాలీవుడ్ లో సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

తాజాగా 515 కోట్ల రూపాయల వసూళ్లతో బాహుబలి 2 రికార్డ్ ను బద్దలు కొట్టింది గదర్ 2. ఈ సినిమా నెక్ట్ టార్గెట్ షారుఖ్ పఠాన్ మూవీనే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు పఠాన్ సినిమా 524 కోట్ల రూపాయలతో నెంబర్ వన్ గ్రాసర్ గా ఉంది. ఇప్పుడీ ప్లేస్ పై గదర్ 2 కన్నేసింది. మరో 9 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తే టాప్ పొజిషన్ కు ఈ సినిమా చేరనుంది. గదర్ 2 సినిమాలో సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *