మెగాస్టార్ చిరంజీవి నెక్ట్ ఇయర్ కు భారీ లైనప్ చేసుకున్నారు. ఆయన తన 156, 157 ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేశారు. వీటిలో 157 మూవీపై బాగా బజ్ ఏర్పడుతోంది. ఈ సినిమా సోషియో ఫాంటసీ కథతో భారీ బడ్జెట్ తో తెరకెక్కనుండటమే ఈ క్రేజ్ కు కారణం. చాలా కాలం తర్వాత మెగాస్టార్ సోషియో ఫాంటసీ కథతో సినిమా చేస్తుండటం విశేషం. బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ట ఈ సినిమాను రూపొందించనున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి.

ఈ సినిమా నెక్ట్ ఇయర జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాతో పాటే మెగాస్టార్ తన 156వ సినిమానూ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాకు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తారని టాక్ వినిపిస్తోంది. చిరు 156ను గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో చిరు కూతురు సుస్మిత నిర్మించనుంది. ఈ రెండు సినిమాలతో వచ్చే ఏడాది మెగాస్టార్ బిజీగా ఉండబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *