నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించి రీసెంట్ గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాకు ఆడియెన్స్ తో పాటు సెలబ్రిటీల అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. ఈ సినిమా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ డైరెక్టర్ మారుతి, స్టార్ హీరోయిన్ సమంత మెప్పుపొందగా..తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. హీరో రవితేజ కూడా ఈ సినిమా తనకు బాగా నచ్చిందంటూ ట్వీట్ చేశారు. సినిమా సక్సెస్ నేపథ్యంలో టీమ్ కు కంగ్రాట్స్ చెప్పారు.

మహేశ్ బాబు ట్వీట్ చేస్తూ – ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాను మా ఫ్యామిలీతో కలిసి ఆద్యంతం ఎంజాయ్ చేశాను. కంప్లీట్ ఎంటర్ టైనర్ మూవీ ఇది. నవీన్ పోలిశెట్టి తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అనుష్క ఎప్పటిలాగే బ్రిలియంట్ గా నటించింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు పి.మహేశ్ బాబు, యూవీ క్రియేషన్స్, మిగతా టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాట్స్. అని పేర్కొన్నారు.

రీసెంట్ గా రిలీజైన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ పాజిటివ్ టాక్ కు తగినట్లే మంచి వసూళ్లు దక్కించుకుంటోంది. యూఎస్ లో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వన్ మిలియన్ మైల్ స్టోన్ వైపు దూసుకెళ్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కథతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌ నిర్మాణంలో దర్శకుడు మ‌హేష్ బాబు.పి తెరకెక్కించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *