హీరో నాని తన కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ఆయన కోలీవుడ్ లో శివకార్తికేయన్ హీరోగా డాన్ అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు నానితో ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనింగ్ మూవీ చేసేందుకు సిబి చక్రవర్తి రెడీ అవుతున్నారు. ఈ సినిమా లాంఛింగ్ గురించి ఓ అప్ డేట్ తెలుస్తోంది.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ సంస్థ నిర్మించే ఈ సినిమా దసరా పండుగ రోజు లాంఛనంగా ప్రారంభం కానుందని సమాచారం. అక్టోబర్ నెలాఖరుకు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట. అప్పటికి నాని 30వ సినిమా హాయ్ నాన్న షూటింగ్ కంప్లీట్ అవుతుంది.

హాయ్ నాన్న మూవీని డిసెంబర్ 21న విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. దసరా బ్లాక్ బస్టర్ తో ఫామ్ లోకి వచ్చిన నాని మరోసారి కథల ఎంపికలో తప్పు జరగకుండా జాగ్రత్తగా మూవీస్ ఎంచుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *