మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 157వ సినిమా నుంచి అదిరే అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ బిగిన్ అయినట్లు దర్శకుడు వశిష్ట సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలో చిరంజీవి, వశిష్టతో పాటు యూవీ నిర్మాతలు ప్రమోద్, విక్కీ, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు ఉన్నారు.

ఈ సందర్భాన్ని దర్శకుడు వశిష్ట ట్వీట్ చేస్తూ – మెగాస్టార్ 157 ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఈ కలల ప్రాజెక్ట్ ప్రాణం పోసుకుంటోంది. మిమ్మల్ని త్వరలో ఒక కొత్త సినిమాటిక్ అడ్వెంచర్ లోకి తీసుకెళ్తాం. అంటూ పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ఇది.

బింబిసార సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ నిరూపించుకున్న వశిష్ట మెగాస్టార్ తో ఓ మెమొరబుల్ మూవీ రూపొందిస్తాడనే అంచనాలు ఏర్పడుతున్నాయి. భారీ గ్రాఫిక్స్, భారీ బడ్జెట్ తో ఎపిక్ మూవీగా చిరు 157 ఉండబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *