షారుఖ్ ఖాన్ కొత్త సినిమా జవాన్ వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సునామీ లాంటి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమాకు నిన్న ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా 144 కోట్ల రూపాయల వసూళ్లు రావడం ఒక సెన్సేషన్ గా చెప్పుకోచ్చు. ఒక సినిమా లైఫ్ టైమ్ రెవెన్యూ ఒక్క రోజులో రాబట్టడం జవాన్ కే సాధ్యమైంది. రిలీజైన రెండు రోజుల్లో జవాన్ ఏకంగా 240 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. నిన్న శనివారం ఓన్లీ హిందీలో 68 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయి.

ఇక ఓవర్సీస్ లోనూ జవాన్ కలెక్షన్స్ మామూలుగా లేవు. నిన్న వీకెండ్ శనివారం జవాన్ వరల్డ్ వైడ్ 7 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో యూఎస్, యూకే సహా పలు దేశాలున్నాయి. షారుఖ్ గత సినిమా పఠాన్ వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించగా..జవాన్ వాటిని దాటేసేలా కనిపిస్తోంది. ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై దర్శకుడు అట్లీ రూపొందించారు. విజయ్ సేతుపతి, నయనతార, దీపిక పడుకోన్, ప్రియమణి ఇతర కీ రోల్స్ ప్లే చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *