మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ మూవీ ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే థియేటర్ రిలీజ్ లోనూ భారీ సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొందీ సినిమా. ఇప్పుడు భోళా శంకర్ థియేటర్స్ లోకి వస్తుండటంతో మరోసారి ట్రోలర్స్ రెచ్చిపోతారని మెగాభిమానులు కంగారుపడుతున్నారు.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలో దర్శకుడు మెహర్ రమేష్ భోళా శంకర్ సినిమాను రూపొందించారు. అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కించారు. తమన్నా హీరోయిన్ గా నటించగా…కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించింది. ఈ సినిమా థియేటర్స్ లో పూర్ ఫర్ ఫార్మెన్స్ చేసింది.

దాదాపు 90కోట్ల రూపాయల బిజినెస్ అయిన ఈ సినిమా 30 కోట్ల రూపాయలకే ఫుల్ రన్ కంప్లీట్ చేసుకుంది. బయ్యర్స్ దాదాపు 75శాతం నష్టపోయారు. భోళా శంకర్ ఫలితంతో కొన్నాళ్ల పాటు రీమేక్స్ చేయొద్దని చిరంజీవి డెసిషన్ తీసుకున్నారంటే ఈ సినిమా రిజల్ట్ ఆయయను ఎంతగా హర్ట్ చేసిందో ఊహించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *