రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా కోలీవుడ్ లో మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళనాట వంద కోట్ల రూపాయల షేర్ సాధించిన ఒకే ఒక సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకు మొత్తంగా 630 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఈ ఎవర్ గ్రీన్ రికార్డ్ తో రజనీ తన స్టార్ డమ్ రేంజ్ చాటుకున్నారు. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా జైలర్ రిలీజైంది. తమిళ నాట ఇప్పటికీ థియేటర్స్ లో ప్రదర్శితమవుతోంది.

జైలర్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక్కడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. అత్యధిక నిమిషాల వ్యూయర్ షిప్ సాధించిన సినిమాగా జైలర్ నిలిచింది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. కుటుంబం కోసం ఓ జైలర్ చేసిన సాహసాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా సాధించిన ఘన విజయాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేస్తోంది సన్ పిక్చర్స్. రజనీ సహా దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ కు ఖరీదైన కార్లు గిఫ్టుగా ఇచ్చింది. జైలర్ సినిమాకు త్వరలో సీక్వెల్ కూడా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *