పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఓజీ జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఇప్పటికే 60 రోజులు షూటింగ్ చేసుకుందంటే అది సర్ ప్రైజింగ్ విషయమే. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు సుజీత్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఓజీ సినిమా షెడ్యూల్ బ్యాంకాక్ లో మొదలైంది.

పవన్ ఇతర లీడ్ యాక్టర్స్ పాల్గొంటున్న బ్యాంకాక్ షెడ్యూల్ తో ఓజీ షూటింగ్ కీలక దశకు చేరుకుంటుంది. మెయిన్ పోర్షన్స్ అన్నీ ఈ షెడ్యూల్ తో పూర్తి చేయబోతున్నారు. సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్ ఓజీ షూటింగ్ 60 రోజుకు చేరుకుందని తెలిపాడు. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

రీసెంట్ టైమ్స్ లో పవన్ సినిమాల్లో బుల్లెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ఇదే కావడం విశేషం. ఫ్యాన్స్ కూడా ఓజీ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తిగా ఉన్నారు. రీసెంట్ గా ఈ సినిమా గ్లింప్స్ హంగ్రీ చీతా క్రియేట్ చేసిన సెన్సేషన్ సినిమా మీద ఉన్న క్రేజ్ ను చూపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *