నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు మహేశ్ బాబు.పి. రూపొందించారు. క్లీన్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరపైకి వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి స్టడీ కలెక్షన్స్ తో స్క్రీనింగ్ అవుతోంది.

యూఎస్ లో ఈ సినిమాకు ఆదరణ బాగుంది. తాజాగా అక్కడి బాక్సాఫీస్ వద్ద మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి హాఫ్ మిలియన్ మార్క్ దాటేసింది. 550కె డాలర్స్ కలెక్షన్స్ తో మిలియన్ డాలర్ మార్క్ వైపు దూసుకెళ్తోంది. హీరో నవీన్ పోలిశెట్టి యూఎస్ లోని పలు స్టేట్స్ లో పర్యటిస్తూ చేస్తున్న ప్రమోషన్ కూడా సినిమాకు వర్కవుట్ అయ్యింది.

ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిపై ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. దర్శకులు రాజమౌళి, మారుతి, హీరోయిన్ సమంత తదితరులు సినిమా తమకు బాగా నచ్చిందంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *