కోలీవుడ్ హీరో విశాల్ నటించిన కొత్త సినిమా మార్క్ ఆంటోనీ విడుదలకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ పై స్టే విధించాలంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. మార్క్ ఆంటోనీ సినిమా ఈ నెల 15న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిఉంది.

విశాల్ తమ సంస్థకు సినిమాలు చేస్తానంటూ దాదాపు 22 కోట్ల రూపాయలు తీసుకున్నాడని, సినిమాలు చేయకుండా, డబ్బు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడని లైకా ప్రొడక్షన్స్ సంస్థ అంటోంది. తమ దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చే వరకు అతని సినిమాలు విడుదల చేయకూడదని గతంలో కోర్టు తీర్పు ఇచ్చిందని..లైకా సంస్థ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా మార్క్ ఆంటోనీ సినిమాను విడుదల చేస్తున్నారంటూ లైకా సంస్థ పిటిషన్ పేర్కొంది.

లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టు పిటిషన్ తో మార్క్ ఆంటోనీ సినిమా విడుదలపై సందేహాలు నెలకొంటున్నాయి. ఈ సినిమాకు వినోద్ కుమార్ నిర్మాత కాగ..అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *