వెంకటేష్ ప్రస్తుతం తన కొత్త సినిమా సైంధవ్ లో నటిస్తున్నారు. ఇది వెంకటేష్ నటిస్తున్న 75వ సినిమా. యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్నారు. సైంధవ్ మూవీని పాన్ ఇండియా స్థాయిలో నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం శ్రీలంక వెళ్లింది.

శ్రీలంకలో క్రూషియల్ షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నారు. దీంతో సినిమా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కు రానుంది. మిగతా షూటింగ్ హైదరాబాద్ తిరిగొచ్చాక చేస్తారట. ఈ సినిమాను నవంబర్ కల్లా పూర్తి చేసి డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

సైంధవ్ కాస్టింగ్ పరంగా బలంగా ఉండనుంది. రుహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్ధికీ, ఆండ్రియా జెర్మేయా, శ్రద్ధా శ్రీనాథ్ కీ రోల్స్ చేస్తున్నారు. హిట్, హిట్ 2 సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకుని ఫామ్ లో ఉన్న శైలేష్ కొలను సైంధవ్ తో హ్యాట్రిక్ మీద నమ్మకంతో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *