కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన రూల్స్ రంజన్ ట్రైలర్ రిలీజైంది. ఈ సినిమాను నిర్మాత ఏంఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు రత్నం కృష్ణ రూపొందించారు. ఈ నెల 28న రిలీజ్ కు రెడీ అవుతున్న రూల్స్ రంజన్ ట్రైలర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

లైఫ్ లో ఎలా ఉండాలో అతనికి కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి మనో రంజన్ ను అందరు రూల్స్ రంజన్ అని పిలుస్తుంటారు. ఉద్యోగం కోసం ముంబై వెళ్లిన మనోరంజన్ అక్కడ కూడా తన లైఫ్ స్టైల్ ఏమాత్రం మార్చకుండా కొనసాగిస్తుంటాడు. కాలేజ్ ఫ్రెండ్ సనా ముంబైలో అనుకోకుండా కలవడం రంజన్ ను సర్ ప్రైజ్ చేస్తుంది. ఆమెతో పబ్ లకు వెళ్తూ దగ్గరవుతాడు. రాత్రి తాగిన టైమ్ లో ఏం చేస్తున్నదీ సనాకు గుర్తుండదు. కానీ ఆమె తనతో చాలా క్లోజ్ గా ఉండటంతో ప్రేమలో పడతాడు రంజన్. లవ్ యాంగిల్ లో ఆలోచించని సనా మరొకరితో పెళ్లికి రెడీ అ‌వుతుంది. చివరకు ఈ జంట కలిశారా లేదా అనేది ట్విస్ట్.

ట్రైలర్ ఆద్యంతం హిలేరియస్ గా సాగింది. ఫ్రెండ్స్ గ్యాంగ్ హైపర్ ఆది, నెల్లూరు సుదర్శన్, వైవా హర్షాకు తోడు వెన్నెల కిషోర్ కూడా ఫన్ హంగమా క్రియేట్ చేశారు. అమ్మ పాలిచ్చి పెంచితే, ప్రేమలో ఫెయిలైన కొడుకుకు తండ్రి మందు ఇచ్చి ఓదార్చాలి, ఫ్రెండ్స్ మధ్య ప్రాబ్లమ్ వస్తే మందు కొట్టాలి గానీ, మందు వల్ల ఫ్రెండ్స్ మధ్య ప్రాబ్లమ్స్ రాకూడదు వంటి డైలాగ్స్ ట్రైలర్ లో పేలాయి. ట్రైలర్ మొత్తం కామెడీ సీన్స్ తో పాటు పంచ్ డైలాగ్స్ తో ఆకట్టుకునేలా సాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *