షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ జవాన్ బాక్సాఫీస్ వద్ద మాన్ స్టర్ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా డే వన్ కలెక్షన్స్ కొత్త రికార్డులు సృష్టించాయి. రిలీజ్ టైమ్ కు జవాన్ మీద నెలకొన్న విపరీతమైన హైప్ కలెక్షన్స్ లో రిఫ్లెక్ట్ అయ్యింది. తొలి రోజు దేశవ్యాప్తంగా 70 కోట్ల రూపాయల నెట్ ఆర్జించిన జవాన్..వరల్డ్ వైడ్ 120 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ ట్రెండ్ చూస్తుంటే జవాన్ అన్ని బాలీవుడ్ రికార్డులు తుడిచేసేలా కనిపిస్తోంది.

జవాన్ కు డే వన్ 26 లక్షల టికెట్స్ అమ్ముడవడం విశేషం. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు జవాన్ కు క్రిటిక్స్ ప్రైసెస్ కూడా దక్కాయి. జవాన్ ను మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా క్రిటిక్స్ 4 స్టార్ రేటింగ్స్ ఇచ్చారు. ఇక ఈ సక్సెస్ పై షారుఖ్, నయనతార, దర్శకుడు అట్లీ తమ సంతోషాలను వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ మహేశ్ జవాన్ సక్సెస్ పై పొగడ్తలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఒక ఫ్యాన్ బాయ్ ట్వీట్ లా ఉండి ఆకట్టుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *