చిన్న సినిమాలకు సపోర్ట్ చేయడాన్ని కంటిన్యూ చేస్తున్నారు హీరో విశ్వక్ సేన్. మనం ఒక ఈవినింగ్ రెండు మూడు గంటలు మనవి కాదనుకుంటే ఓ చిన్న సినిమాకు ప్రమోషన్ జరుగుతుంది అందుకే వీలైనంతవరకు చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తానని అని చెప్పినట్లుగానే టాలెంటెడ్ యంగ్ యాక్టర్స్ సినిమాల ఫంక్షన్స్ కు వస్తున్నాడు విశ్వక్. ఈ క్రమంలో “రామన్న యూత్” సినిమా ప్రీ రిలీజ్ కు రాబోతున్నారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్.

అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. “రామన్న యూత్” సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 11న హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. విశ్వక్ సేన్ ఈ ఫంక్షన్ కు అతిథిగా హాజరుకానున్నారు.

బలగం వంటి సహజమైన మన నేటివ్ కథలు ఆదరణ పొందుతున్న నేపథ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “రామన్న యూత్” సినిమా కూడా ఆకట్టుకుంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. రీసెంట్ గా హీరో సిద్ధార్థ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన “రామన్న యూత్” ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *