యువ నటుడు అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “రామన్న యూత్”. విలేజ్ బ్యాక్ డ్రాప్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. “రామన్న యూత్” సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్ ను హీరో సిద్ధార్థ్ విడుదల చేశారు. “రామన్న యూత్” సినిమా ట్రైలర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

అంకుశాపూర్ ఊరిలో యూత్ లీడర్ కావాలని కలలు గనే యువకుడు రాజు. ఫ్రెండ్స్ చందు, బాలు, రమేష్.. రాజుకు సపోర్ట్ చేస్తారు. రాజుకు ఎమ్మెల్యే అంటే అభిమానం. ఎలాగైనా అతని దృష్టిలో పడి యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు. ముందు లోకల్ లీడర్ అనిల్ అన్న దగ్గర పేరు తెచ్చుకుంటే ఎమ్మెల్యేకు దగ్గరకావచ్చని ఆలోచిస్తాడు. ఇందుకోసం ఫ్రెండ్స్ సలహా మీద పండుగకు ఊరిలో పెద్ద ఫ్లెక్సీ పెట్టిస్తాడు. అందులో కొన్ని ఇంపార్టెంట్ పేర్లు మిస్ అవుతాయి. నా పేరు పెట్టడమే మర్చిపోతావా అంటూ స్నేహితుడు బాలు గొడవ చేస్తాడు. అక్కడి నుంచి ఫ్రెండ్స్ మధ్యే గొడవలు మొదలవుతాయి. ఈ రాజకీయాలు నీకెందుకురా..ఉద్యోగం చేసుకోమనే సలహాలు ఊరి వాళ్లు ఇస్తారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో రాజు యూత్ లీడర్ కావాలనే కలను నిజం చేసుకున్నాడా లేదా..ఈ కథలో స్వప్నతో రాజు ప్రేమ కథ సుఖాంతం అయిందా లేదా అనే ప్రశ్నలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. సినిమా అంతా నేచురల్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జెన్యూన్ గా తెరకెక్కించినట్లు మేకింగ్ చూస్తే అర్థమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *