సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న మామా మశ్చీంద్ర సినిమా రిలీజ్ డేట్ ను సడెన్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా ప్రోగ్రెస్ ఇప్పటిదాకా ఏంటనేది బయటకు రాలేదు. అప్పుడెప్పుడో ఓ టీజర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మూవీ రిలీజ్ డేట్ అక్టోబర్ 6న అంటూ ప్రకటించారు. మామా మశ్చీంద్ర మీద ఎలాంటి బజ్ రావడం లేదు.

మామా మశ్చీంద్ర సినిమాలో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నారు. ఇందులో ఒకటి పరశురామ్ అనే డాన్, మరొకటి డీజే, ఇంకోటి దుర్గ అనే ఫ్యాట్ మ్యాన్. ఈ మూడు గెటప్స్ లో సుధీర్ బాబు డిఫరెంట్ లుక్స్ లో ఉన్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థ నిర్మాణంలో దర్శకుడు హర్షవర్థన్ తెరకెక్కిస్తున్నారు. ఈషా రెబ్బ, మృణాలిని రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *