తెలుగుతో పాటు హిందీ, తమిళంలో రానాకు మంచి గుర్తింపు ఉంది. ఈ యాక్టర్ సడెన్ గా ఓ బాలీవుడ్ మూవీలోనో, తమిళ చిత్రంలోనో పార్ట్ అయినట్లు అనౌన్స్ మెంట్స్ వస్తుంటాయి. ఇవి సర్ ప్రైజింగ్ గా అనిపించినా..రానా గత సినిమాలు చూస్తే వీటికి కారణం తెలుస్తోంది. రానా హిందీలో బేబి లాంటి మూవీస్ చేశాడు, ఆయన సినిమాలెన్నో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రాలుగా వచ్చాయి.

ఈ గుర్తింపుతో సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రంలో ఆఫర్ దక్కించుకున్నారు రానా. రజనీతో దర్శకుడు కేజీ జ్ఞానవేల్ రూపొందిస్తున్న సినిమాలో రానా ఓ కీలక పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. రజనీకాంత్ నటిస్తున్న ఈ 170వ సినిమాలో టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇప్పటికే కీ రోల్ కోసం ఎంపికయ్యారు.

పోలీస్ అధికారి కథతో తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైంది. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ కు టీమ్ సిద్ధమవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *