పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీశ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇప్పటికే కొంత పార్ట్ షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభించుకుంది. ఈ యాక్షన్ షెడ్యూల్ లో పవర్ స్టార్ పవన్ పాల్గొంటున్నారు. నేటి నుంచి ఈ షెడ్యూల్ ప్రారంభమైనట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. రీసెంట్ గా దర్శకుడు హరీశ్ పలు రకాల ఆయుధాలతో ఉస్తాద్ యాక్షన్ కు రెడీ అంటూ ట్వీట్ చేశాడు.

పవర్ ఫుల్ పోలీస్ అధికారి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ హిట్ ఫిల్మ్ తెరికి రీమేక్ అనే టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *