దసరా సినిమాతో యాక్షన్ మూవీ చేసి రా అండ్ రగ్డ్ లుక్ లో సక్సెస్ అందుకున్న నాని మరోసారి యాక్షన్ మూవీకి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించబోతున్నారు. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో గతంలో అంటే సుందరానికీ సినిమా తెరకెక్కింది. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాగా..ఇప్పుడు వీరి కాంబినేషన్ లో భారీ యాక్షన్ మూవీ రానుండటం విశేషం.

నాని కొత్త సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ మేకింగ్ తో ఉండనుందని టాక్ వినిపిస్తోంది. దసరా తర్వాత నాని అలాంటి మరో పాన్ ఇండియా ప్రయత్నం చేస్తున్నట్లు అనుకోవాలి. పాన్ ఇండియా సినిమాలంటూ ప్రత్యేకంగా చేయనక్కర్లేదని, మన సినిమా బాగుంటే అదే పాన్ ఇండియా అవుతుందని గతంలో చాలాసార్లు నాని చెప్పారు. మరి అలాంటి కథ ఇప్పుడు కుదిరిందని అనుకోవచ్చు.

ప్రస్తుతం నాని తన 30వ సినిమా హాయ్ నాన్నలో నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ డిసెంబర్ 21న హాయ్ నాన్న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *