హీరో విజయ్ దేవరకొండ తన ఖుషి సంపాదన నుంచి, తన సంపాదన నుంచి వంద మంది అభిమానుల ఫ్యామిలీస్ కు తలా లక్ష రూపాయల చొప్పున గిఫ్ట్ ఇస్తానని ప్రకటించిన వెంటనే టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ పిక్చర్స్ స్పందించింది. తమకు కూడా వరల్డ్ ఫేమస్ లవర్ డిస్ట్రిబ్యూషన్ తాలుకు 8 కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాలంటూ విజయ్ ను కోరింది. ఈ రిక్వెస్ట్ పై సోషల్ మీడియాలో అభిషేక్ పిక్చర్స్ ను నెటిజన్స్ ఆడుకుంటున్నారు.

అభిషేక్ పిక్చర్స్ ను నెటిజన్స్ అడుగుతున్న ప్రశ్నలు ఇవే..

– అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన రావణాసుర, సాక్ష్యం వంటి సినిమాలను చూసి మేము టికెట్ డబ్బులు లాస్ అయ్యాం. ఆ డబ్బులు వెనక్కి ఇస్తారా?

– విజయ్ నటించిన అర్జున్ రెడ్డి సినిమా వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూట్ చేసిన మీకు ఎంత లాభాలు వచ్చాయి. ఆ లాభాల్లోంచి విజయ్ కు ఎంత ఇచ్చారు?

– సినిమా డిస్ట్రిబ్యూషన్ అనేది బిజినెస్ వరల్డ్ ఫేమస్ లవర్ కు లాభాల వచ్చి ఉంటే మీరు అందులోంచి హీరోకు తిరిగి ఇచ్చేవారా?

– ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో నిర్మాత ఇన్వాల్వ్ అవుతాడు గానీ హీరోకు ఏం సంబంధం?

– ఒక పెద్ద కుటుంబంలోంచి వచ్చిన హీరోను అయితే ఇదే విధంగా డబ్బులు తిరిగి ఇవ్వమని ప్రశ్నించగలరా?

ఇలాంటి ప్రశ్నలు అభిషేక్ పిక్చర్స్ కు సంధిస్తున్నారు నెటిజన్స్. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదుగుతున్న విజయ్ లాంటి హీరోలను చూసి ఓర్వలేకపోతున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *