ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ వైజాగ్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ అభిమానుల గురించి ఎమోషనల్ గా మాట్లాడారు. అభిమానుల వల్లే ఖుషి ఇంత పెద్ద సక్సెస్ అయ్యిందన్నారు. తన సంతోషంతో పాటు సంపాదన కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటానని విజయ్ చెప్పారు. వంద మంది ఫ్యామిలీస్ కు తలా లక్ష చొప్పున పది రోజుల్లో అందిస్తానన్నారు. విజయ్ ఇంకా ఏమన్నారో చూస్తే…

మూడు రోజుల్నించి చూస్తున్నా మీ మొహల్లో సంతోషం చూసి నాకు చాలా తృప్తిగా ఉంది. ఖుషి ఒక సింపుల్, క్యూట్ ఎమోషనల్ లవ్ స్టోరి. సినిమా చేసేప్పుడు శివ కూడా ఇదే మాట చెప్పాడు. విజయ్ బ్రో మనం ఒక క్యూట్ లవ్ స్టోరిని ఒక మంచి పాయింట్ చెబుతూ ఫ్యామిలీస్ హాయిగా చూసేలా చేద్దామని అనేవాడు. ఇవాళ సినిమాకు మీరు అందిస్తున్న ప్రేమ చూస్తుంటే కృతజ్ఞతగా మీకు మేము చాలా చాలా చేయాలని అనిపిస్తోంది. నేను డబ్బు సంపాదించాలి, అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి, సమాజంలో గౌరవంగా బతకాలి అనేది మాత్రమే ఆలోచించేవాడిని. ఇవాళ ఖుషికి మీరిస్తున్న ఆదరణ చూస్తుంటే నేనొక మంచి సినిమా చేస్తే చూసేందుకు మీరంతా ఎదురుచూస్తున్నారని అర్థమైంది.

నేను గెలవాలని, నా సినిమాలు విజయం సాధించాలని మీరంతా కోరుకుంటున్నారు. నా సినిమాలు ఫ్లాపైతే బాధపడుతున్నారు, నా సినిమా హిట్ అయితే సంతోషిస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి చెబుతున్నా. ఇప్పటి నుంచి నేను నా ఫ్యామిలీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ మీ కోసం కూడా పనిచేస్తా. మీరెప్పుడూ నవ్వుతూ ఉండాలి ఖుషిని మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. మీ నవ్వులు చూద్దామని అనుకున్నా చూస్తున్నా. కానీ తృప్తి లేదు. కానీ ఏదో చేయాలని ఉంది. పర్సనల్ గా మీ అందరినీ కలవలేను. మీరు ఖుషిగా ఉన్నారు నేను ఖుషిగా ఉన్నా. నా ఖుషి మీతో పంచుకునేందుకు నా ఖుషి సంపాదన నుంచి కోటి రూపాయలు నా ఫ్యామిలీ అయిన మీకు ఇస్తున్నా. త్వరలో వంద ఫ్యామిలీస్ ను సెలెక్ట్ చేసి ప్రతి ఫ్యామిలీకి లక్ష రూపాయల చెక్ నేను అందిస్తా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *