నట సింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సింహా, లెజెండ్, అఖండ.. చిత్రాలు ఒక దానిని మించి మరొకటి సక్సెస్ అయ్యాయి. వీరిద్దరి కాంబోలో మరో మూవీ రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా చేస్తున్న బాలయ్య తర్వాత బాబీతో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ లోపు రిలీజ్ చేయాలనేది ప్లాన్. అయితే.. ప్రస్తుతం స్కంద సినిమా చేస్తున్న బోయపాటి.. నెక్ట్స్ బాలయ్యతో సినిమా చేయనున్నారట.

దీని కోసం అదిరిపోయే స్టోరీ రెడీ చేస్తున్నారట. ఇప్పటి వరకు బాలయ్యను చూపించని విధంగా సరికొత్తగా చూపించేలా ఈ స్టోరీ ఉంటుందట. మరో విషయం ఏంటంటే.. ఈసారి సోసియో ఫాంటసీ కథాంశంతో మూవీ చేయాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ సినిమాను సమ్మర్ తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారట. ఈ సినిమా తర్వాత అఖండ సీక్వెల్ అఖండ 2 ఉంటుందని వార్తలు వస్తున్నాయి. బాలయ్య, బోయపాటి కాంబో అంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు మించి ఉండేలా.. పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాడట. మరి.. ఈసారి ఏ స్థాయి విజయం సాధిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *