సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కొత్త సినిమా గుంటూరు కారం షూటింగ్ ను సూపర్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తున్నారు. నిన్నటివరకు యాక్షన్ సీక్వెన్సులు చేసిన మహేశ్…ఇప్పుడు సాంగ్ షూట్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారులో వేసిన సెట్ లో ఈ పాట చిత్రీకరించనున్నారు. ఇది సినిమాలో మహేశ్ సోలో సాంగ్ గా ఉండనుందట. రేపటి నుంచి ఈ సాంగ్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

వచ్చే సంక్రాంతికి గుంటూరు కారం సినిమాను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నారు. ఇందుకు నిర్మాణ సంస్థ హారికా హాసినీ క్రియేషన్స్ కూడా పట్టుదలగా ఉందట. సోషల్ మీడియాలో గుంటూరు కారం గురించి చాలా నెగిటివిటీ వస్తున్న నేపథ్యంలో చెప్పిన తేదీకి సినిమాను తెరపైకి తీసుకురావాలని టీమ్ నిర్ణయించుకున్నారు. నాన్ స్టాప్ షెడ్యూల్స్ లో ఈ సినిమాను పూర్తి చేయబోతున్నారు.

పూజా హెగ్డే గుంటూరు కారం నుంచి బయటకు వెళ్లిన నేపథ్యంలో ఆ ప్లేస్ లో మీనాక్షి చౌదరి వచ్చేసింది. శ్రీలలకు పూజ క్యారెక్టర్ వెళ్లింది. అయితే మీనాక్షి చౌదరి క్యారెక్టర్ ఇంటర్వెల్ తర్వాత ఎంట్రీ ఇస్తుందని టాక్ వినిపిస్తోంది. జగపతి బాబు, రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *