గ్లామర్ విషయంలో సంప్రదాయంగా ఉన్న హీరోయిన్సే కొద్దికాలం పాటు ఇండస్ట్రీలో ఉండగలిగారు. రాగానే స్వేచ్ఛగా కనిపించిన వారి పట్ల ఇండస్ట్రీలో క్రేజ్ కనిపించదు. పైగా స్టార్ హీరోలు ట్రెడిషినల్ గా కనిపించే హీరోయిన్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇలా ఇన్నాళ్లు మెయింటేన్ చేసిన తార కీర్తి సురేష్. ఏళ్లు గడుస్తున్నా కొద్దీ ఆమె కూడా కొద్ది కొద్దిగా గ్లామర్ ఫ్రీడమ్ తీసుకుంటోంది.

మహేశ్ సర్కారు వారి పాట సినిమా కోసం ఫస్ట్ టైమ్ తన గ్లామర్ బౌండరీస్ దాటి కాస్ట్యూమ్స్ వేసుకుంది కీర్తి. ఆ సినిమాలోని యూఎస్ సీన్స్ లో ఆమె డ్రెస్సులు ఇప్పటికీ వైరల్ అవుతాయి. అలాగే మురారి వా పాటలోనూ కీర్తి కాస్ట్యూమ్స్ యూత్ కు బాగా నచ్చాయి. ఆమె లేటేస్ట్ సోషల్ మీడియా పోస్టుల్లోనూ అందాన్ని చూపించడంలో కొంత స్వేచ్ఛగా కనిపిస్తోంది. ఇటీవల భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వేసుకున్న డ్రెస్ కూడా చిరు లాంటి దిగ్గజాన్ని కూడా కొద్దిగా కదిలించింది. కీర్తి తాజా సోషల్ మీడియా పోస్ట్ లో షేర్ చేసిన ఫొటో ఒకటి ఇలాంటి గ్లామర్ తోనే ఉండి చూడగానే ఆకట్టుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *