పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఓజీ నుంచి గ్లింప్స్ రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ గ్లింప్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా వచ్చిన హంగ్రీ చీతా సాంగ్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ చేయడం అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. హంగ్రీ చీతాకు వచ్చిన రెస్పాన్స్ చూసిన మూవీ టీమ్ ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా జస్ట్ అనౌన్స్ చేసి వెంటనే రిలీజ్ చేశారు.

హంగ్రీచీతా మ్యూజిక్ గ్లింప్స్ కు బిగ్ అట్రాక్షన్ అయ్యింది. థమన్ ఈ పాట రిలీజ్ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇటీవల థమన్ మ్యూజిక్ మళ్లీ రొటీన్ అనిపిస్తున్న టైమ్ లో హంగ్రీ చీతా బీట్ అందరినీ ఆకట్టుకుంది. ఈ పాటను తెలుగు, తమిళ, హిందీలో రిలీజ్ చేశారు.

సావన్, గానా, స్పోర్టివై ‌వంటి మ్యూజిక్ ప్లేయింగ్ యాప్స్ ద్వారా మాత్రమే ఈ పాటను వినొచ్చు. ఈ పాటకు కూడా రెస్పాన్స్ బాగుంది. గ్లింప్స్ కు వచ్చిన రెస్పాన్స్ మూవీ టీమ్ లో ఉత్సాహాన్ని నింపింది. ఇదే జోష్ లో మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేయాలని ఓజీ టీమ్ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *