బేబీ సినిమా ఓ సంచలనం. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఈ ముగ్గురికీ మంచి పేరు తీసుకువచ్చింది. అలాగే చిత్ర దర్శకుడు సాయిరాజేష్ కు కూడా మంచి పేరు తీసుకువచ్చింది. ఈ మూవీ 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా బేబీ మూవీ టీమ్ ని అభినందించారు. దీనిని బట్టి బేబీ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. సాయి రాజేష్ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది.

తాజా సమాచారం ప్రకారం.. సాయిరాజేష్.. బేబి చిత్రానికి సీక్వెల్ చేయాలి అనుకుంటున్నాడట. బేబీ మూవీలో ఆనంద్, విరాజ్, వైష్ణవి చైతన్యల ప్రేమకథ ముగిసింది. ఇందులో మరో కొత్త కథను చెప్పాలనుకుంటున్నాడట. అది కూడా ఫెయిల్యూర్ స్టోరీనే అని తెలిసింది. ఇప్పటికే బేబీ 2 లైన్ సిద్ధం చేశారని.. త్వరలోనే ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేస్తాడని టాక్ వినిపిస్తోంది. మరో విషయం ఏంటంటే.. బేబీ కాంబో అయిన ఆనంద్, విరాజ్, వైష్ణవి కాంబోలోనే బేబీ 2 ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్నది నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *