పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్న తర్వాత ఏ లాంగ్వేజ్ స్టార్ హీరో అయినా…అన్ని భాషల ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా మూవీస్ ప్లాన్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియాకు చేరే భారీ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వీళ్ల లిస్టులోకే వస్తారు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. ఈగ, బాహుబలి వంటి స్ట్రైట్ తెలుగు చిత్రాలతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. ఆయన నటించిన ప్రతి కన్నడ మూవీ తెలుగులో డబ్ అయి రిలీజ్ అవుతుంటుంది. కిచ్చా సుదీప్ రీసెంట్ పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది. ఇవాళ కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది. టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్ చంద్రూ ఈ సినిమాను రూపొందించబోతున్నారు.

బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల కథా రచయిత వి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్ సూపర్ విజన్ చేస్తుండటం విశేషం. కన్నడలో పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన ఆర్ సీ స్టూడియోస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆర్ చంద్రూ, కిచ్చా సుదీప్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే మేకింగ్ తో తెరపైకి రాబోతోంది. త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. కిచ్చా సుదీప్, ఆర్ చంద్రూ మూవీకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *