కంటెంట్ బాగున్న చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ సాధించడం చూస్తున్నాం. ఏదో ఒక అంశంలో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తే చాలు ఆ సినిమా హిట్ గ్యారెంటీ అనుకోవచ్చు. టీజర్ తో ఇలాంటి ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో కలిగించే ప్రయత్నం చేసింది “రాక్షస కావ్యం” టీమ్. పురాణాల్లోని ఒక పాయింట్ ను తీసుకుని..దాన్ని నేటి సామాజిక పరిస్థితులకు, కాలానికి ముడిపెట్టి ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు శ్రీమాన్ కీర్తి.

నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించారు. “రాక్షస కావ్యం” చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. అక్టోబర్ 6న “రాక్షస కావ్యం” సినిమాను గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం తెలిపారు.

ఇప్పటికే “రాక్షస కావ్యం” సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గత వారం విడుదల చేసిన విలన్స్ ఆంథెమ్ సాంగ్ ఇన్ స్టంట్ హిట్ అయ్యింది. మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి తెరకెక్కించిన ఒక కొత్త తరహా సినిమాగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *