విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి ఇవాళ థియేటర్స్ లోకి వచ్చింది. రాత్రి నుంచే యూఎస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. యూఎస్ ప్రీమియర్స్ నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి సినిమా చూస్తున్న వారంతా సోషల్ మీడియా ద్వారా తన రెస్పాన్స్ చెబుతున్నారు. ఖుషి సూపర్ హిట్ మూవీ అంటూ వారంతా పోస్టులు చేస్తున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫన్ తో క్లీన్ ఎంటర్ టైనర్ గా ఖుషి ఉందని అప్రిసియేషన్స్ వస్తున్నాయి. సమంత, విజయ్ యాక్టింగ్ తో ఆకట్టుకోగా, దర్శకుడు శివ నిర్వాణ మరోసారి బ్యుుటిఫుల్ స్టోరిని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడని చెబుతున్నారు.

ఇక తన కొత్త సినిమా సక్సెస్ పై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. ఆయన ట్వీట్ చేస్తూ…మీరంతా నేను ఇలాంటిి విజయం సాధించాలని ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ మీరు ఆశించిన సక్సెస్ అందుకున్నాను. ఇవాళ ఉదయం నిద్ర లేచినప్పటి నా ఫోన్ మెసేజ్ లతో మోగిపోతోంది. అవన్నీ చూస్తూ సంతోషంలో కన్నీళ్లు వస్తున్నాయి. ఎమోషన్ అవుతున్నా. లవ్ యూ ఆల్. మీరంతా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఖుషి సినిమా చూసేందుకు వెళ్లండి. మీరు వెళ్తారని తెలుసు. అంటూ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *