హీరోయిన్ జయప్రదకు చెన్నైలోని ఎగ్మూరు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఆమె రాయపేటలో గతంలో నిర్వహించిన థియేటర్ లో పనిచేసిన కార్మికులకు బీమా డబ్బులు చెల్లించలేదనే కేసులో ఆమె ఈ శిక్షను ఎదుర్కొన్నారు. ఆరు నెలల జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల పైన్ వేసింది కోర్టు.

ఈ కేసు వివరాలు చూస్తే..గతంలో చెన్నైలోని రాయపేటలో జయప్రద ఓ థియేటర్ నడిపేవారు. ఆమెకు ఈ థియేటర్ నిర్వహణలో మరో ఇద్దరు పార్టనర్స్ ఉండేవారు. ఆమె హీరోయిన్ గా మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఈ థియేటర్ లో హిట్ సినిమాల ప్రదర్శనలు జరిగేవి. లాభాలు వచ్చేవి. అయితే కొన్నాళ్ల తర్వాత నష్టాలు రావడంతో థియేటర్ మూసేశారు. అప్పటిదాకా ఆ థియేటర్ లో పనిచేసిన కార్మికులకు ఈఎస్ఐ బీమా చెల్లించలేదు. ఈ విషయంపై కార్మికులు ఈఎస్ఐకు ఫిర్యాదు చేయగా…అక్కడి నుంచి కేసు కోర్టుకు చేరింది. ఇక ఇప్పుడు కార్మికులకు డబ్బులు ఇస్తామని జయప్రద చెప్పినా శిక్ష తప్పదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *