గ్లోబల్ స్టార్ చరణ్‌, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. ఇందులో చరణ్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుంది. శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తుంటే.. ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తుండడం విశేషం. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న గేమ్ ఛేంజర్ మూవీలో చరణ్‌ పాత్ర ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ నుంచి ఆసక్తిగా మారింది. ఆతర్వాత ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలిసినప్పటి నుంచి ఆ పాత్రలు ఏంటి..? వాటిని ఎలా డిజైన్ చేశారు అనే క్యూరియాసిటీ పెరిగింది.

చరణ్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడట. అది కూడా రెండు టైమ్ లైన్స్ లో ఉంటాయని.. ఈ పాత్రలు తండ్రీకొడుకులుగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. తండ్రి పేరు అప్పన్న కాగా ఆ పాత్ర పొలిటికల్ లీడర్ గా కనిపిస్తుందట. సమాజంలో మార్పు కోసం తపించే నాయకుడుగా కనిపిస్తాడట. ఈ పాత్రకు సంంధించిన కటౌట్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే కొడుకు రామ్ నందన్ గా చరణ్‌ మరో క్యారెక్టర్ లో కనిపిస్తాడట. పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ పేరుకు మ్యాచ్ అయ్యేలా రామ్ నందన్ ఉండడం వైరల్ అవుతోంది.

రామ్ నందన్ పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. ఈ రెండు పాత్రలు మధ్య స్టోరీ అయితే ఏమీ ఉండదని తెలుస్తోంది. ఫ్లాఫ్ బ్యాక్ లో లీడర్ అప్పన్న క్యారెక్టర్ ఉంటుందట. ఇప్పటి వరకు 70 శాతం షూటింగ్ పూర్తయ్యింది. మిగిలిన షూటింగ్ కూడా నవంబర్ కి కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మర్ లో ఈ సినిమా థియేటర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *