వై.ఎస్ పాదయాత్ర కథాంశంగా తెరకెక్కిన చిత్రం యాత్ర. ఈ చిత్రానికి మహి వి రాఘవ డైరెక్టర్. గత ఎన్నికల టైమ్ లో రిలీజైన యాత్ర సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు వై.ఎస్. జగన్ పాదయాత్ర నేపథ్యంతో యాత్ర 2 చేస్తున్నాడు. గత కొంతకాలంగా వార్తల్లో ఉన్న ఈ సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. అయితే.. యాత్ర చిత్రంలో మళయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించగా ఈసారి యాత్ర 2 చిత్రంలో కోలీవుడ్ యంగ్ హీరో జీవా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుందని సమాచారం.

ఇటీవల వై.ఎస్ జయంతి సందర్భంగా యాత్ర 2 మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. యాత్ర వలే యాత్ర 2 కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం ఖాయమనే ఫీలింగ్ కలిగించింది. మహి వి రాఘవ ఈ సినిమా పై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మంచి క్వాలిటీతో అందరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఎన్నికల ముందు ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. యాత్ర 2 ఎంత వరకు మెప్పిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *