మరో భారీ సౌత్ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కు రెడీ అవుతోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన లియో సినిమాను రెండు పార్టులుగా రూపొందిస్తారని తెలుస్తోంది. తొలిభాగం సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ కు రెడీ చేస్తుండగా…రెండో భాగంకు ఈ సినిమాలోనే లీడ్ ఇస్తారని అంటున్నారు. లియో సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో, ఫేమస్ కాస్ట్ అండ్ క్రూతో ఈ సినిమా రూపొందుతోంది.

ఫస్ట్ పార్ట్ రిలీజ్ తర్వాత కనీసం రెండు మూడేళ్ల గ్యాప్ సెకండ్ పార్ట్ సినిమాకు ఉంటుందని సమాచారం. లియో ఫస్ట్ పార్ట్ కు ఒక లీడ్ తో ముగించి…మళ్లీ సెకండ్ పార్ట్ సినిమాను కంప్లీట్ గా షూట్ చేస్తారట. ఈలోగా దర్శకుడు లోకేష్, హీరో విజయ్ తమకున్న ఇతర సినిమాల కమిట్ మెంట్స్ పూర్తి చేస్తారని టాక్ వినిపిస్తోంది. భారీ, క్రేజీ మూవీస్ రెండు పార్టులుగా రావడం ట్రెండ్ గా మారింది. ఇటీవలే లియో నుంచి విలన్ ఆంటోనీ దాస్ గా సంజయ్ దత్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *