పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ రిలీజ్ కు ముందే రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే టికెట్ బుకింగ్ యాప్ లో 200కే ఇంట్రెస్ట్ లతో రికార్డ్ సృష్టించిన సలార్…ఇప్పుడు యూఎస్ రిలీజ్ లో మరో కొత్త చరిత్రను రాసింది. యూఎస్, లాటిన్ అమెరికాలో బిగ్గెస్ట్ థియేటర్ చైన్ సినీమార్క్ ద్వారా వారికున్న అన్ని థియేటర్స్ లో సలార్ స్క్రీనింగ్ కాబోతోంది.

గతంలో ఈ రికార్డ్ ఆర్ఆర్ఆర్ పేరిట ఉంది. ఈ సినిమా సినీ మార్క్ ద్వారా 285 థియేటర్స్ లో ప్రదర్శితమైంది. ఇప్పుడా రికార్డ్ తుడిచేస్తే…సలార్ 315 థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. మొత్తంగా యూఎస్ లో 1979 లొకేషన్స్ లో రిలీజ్ కావడం కూడా సలార్ సృష్టించిన కొత్త రికార్డే. ఈ విషయం తెలిసినప్పటి నుంచి సలార్ టేక్ ఓవర్ యూఎస్ఏ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా..యూఎస్ లో 27 నుంచే ప్రీమియర్స్ మొదలవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *