ఇవాళ సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా గుంటూరు కారం నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ద్వారా మహేశ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోస్టర్ లో మాస్ లుక్ ల్ లుంగీ కట్టుకుని బీడీ తాగుతున్న స్టిల్ ఉంది. ఈ సందర్భంగానే ఈ సినిమా గురించి మరో రూమర్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. సినిమా రిలీజ్ డేట్ ను మరోసారి కన్ఫర్మ్ చేశారు.

ముందుగా ప్రకటించినట్లే గుంటూరు కారం సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ఈ పోస్టర్ ద్వారా తెలిపారు. జనవరి 12న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాదు…వాయిదా పడుతుందనే రూమర్స్ కు చెక్ పెట్టారు దర్శక నిర్మాతలు. పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రెడీ చేయలేరంటూ వార్తలొస్తున్నాయి. అయితే తాము ప్లాన్ ప్రకారమే ఉన్నట్లు ఈ పోస్టర్ ద్వారా ఇండికేషన్ ఇచ్చారు మూవీ టీమ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *