ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. అందుకనే ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్, హాలీవుడ్ మేకర్స్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆతర్వాత బాలీవుడ్ మూవీ వార్ 2 చేయనున్నారు. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించనున్నాడు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ లో సినిమా సెట్స్ పైకి రానుంది. ఇందులో నటించే హీరోయిన్స్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

అయితే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మేటర్ ఏంటంటే… ఇందులో ఎన్టీఆర్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయట. అలాగని విలన్ పాత్ర కాదట. ఒక లక్ష్యంతో అలా ప్రవర్తించిన అతని గతం ఎవరూ ఊహించని విధంగా.. చాలా సర్ ఫ్రైజ్ గా ఉంటుందట. డిసెంబర్ లో ప్రారంభమయ్యే ఈ సినిమాను 2025 రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. యష్‌ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో నటనకు అవకాశం ఉండడంతో వెంటనే ఎన్టీఆర్ ఓకే చెప్పారట. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పై వచ్చే సన్నివేశాలు ఇండియన్ స్ర్కీన్ పై ఇప్పటి వరకు రాని విధంగా ఉంటాయట. మొత్తానికి వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *