పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రంలో పవన్ కు జంటగా శ్రీలీల నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత అనూహ్య స్పందన వచ్చింది. అభిమానులు పవన్ కళ్యాణ్ కి ఎలాగైతే చూడాలి అనుకుంటున్నారో అలా హరీష్ శంకర్ చూపించబోతున్నాడని గ్లింప్స్ ను బట్టి తెలిసింది. దీంతో అప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే.. ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది.

తాజాగా సంక్రాంతికి వస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి..? అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా..? నిజంగా సంక్రాంతికి వస్తుందా..? అనేది సస్పెన్స్ గా మారింది. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ విషయం ఏంటంటే.. లేటెస్ట్ గా వాల్తేరు వీరయ్య 200 డేస్ వేడుకల్లో మైత్రి మూవీ మేకర్స్ వారు మాట్లాడుతూ.. ఏ చిత్రం ఆగిపోలేదు.. అతి త్వరలోనే షూటింగ్ రీస్టార్ట్ చేస్తామన్నారు. ఇక అలాగే రిలీజ్ పై కూడా మాట్లాడుతూ వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా వేసవి కానుకగా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *