సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి అతడు, ఖలేజా చిత్రాలు చేశారు. ఈ రెండు చిత్రాలు ఇద్దరికీ మంచి పేరు తీసుకువచ్చాయి. ఇప్పుడు మూడవ సినిమా చేస్తున్నారు. అదే.. గుంటూరు కారం. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ కు జంటగా పూజా హేగ్డే, శ్రీలీలను కన్ ఫర్మ్ చేశారు. అయితే.. ఈ ప్రాజెక్ట్ నుంచి పూజా తప్పుకోవడంతో శ్రీలీలకు మెయిన్ క్యారెక్టర్ ఇచ్చి.. సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ కు మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.

అయితే.. పూజాకు అడ్వాన్స్ ఇచ్చి ఉండడంతో ఆ అమౌంట్ కి స్పెషల్ సాంగ్ చేయించాలి అనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ పేరు వినిపిస్తోంది. స్పెషల్ సాంగ్ ను కైరాతో చేయించాలి అనుకుంటున్నారట. కారణం ఏంటంటే.. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పాటను కైరాతో చేయించాలని ఫిక్స్ అయ్యారట. ఆమెను కాంటాక్ట్ చేసి ఒప్పించారని కూడా టాక్ వినిపిస్తోంది. భరత్ అనే నేను సినిమాలో మహేష్ కు జంటగా నటించింది. ఇప్పుడు మరోసారి మహేష్ మూవీలో నటిస్తుంది అంటున్నారు. ప్రచారంలో ఉన్న వార్తల పై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *