పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ కలయికలో రూపుదిద్దుకుంటున్న భారీ పీరియాడిక్ మూవీ హరి హర వీరమల్లు. ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఏ ముహూర్తాన్నా ప్రారంభించారో కానీ.. అడుగడుగునా అడ్డంకులే. ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ప్రారంభించిన చిత్రాలు పూర్తవ్వడం.. రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. వీరమల్లు మాత్రం అలాగే ఉంది. ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. పొలిటికల్ గా బిజీగా ఉన్న పవన్ ఇప్పుడు వీరమల్లు సినిమాకి డేట్స్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.

ఇంతకీ.. ఎప్పటి నుంచి అంటే.. సెప్టెంబర్ రెండో వారం నుంచి పవన్ ఈ సినిమాకి డేట్స్ కేటాయించనున్నారని టాక్. ఒకవేళ పవన్ డేట్స్ ఇస్తే.. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పై కొన్ని యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆల్ రెడీ ఓ భారీ సెట్ ను కూడా వేశారని తెలిసింది. మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. పవన్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ వీరమల్లు కావడం విశేషం. మరి.. వీరమల్లు ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో క్లారిటీ రావాలంటే.. కొన్నాళ్లు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *