స్టార్ హీరోయిన్ ఇలియానాకు కొడుకు పుట్టాడు. ఏప్రిల్ లో తాను ప్రెగ్నెంట్ అని ఇలియానా ప్రకటించింది. ఇవాళ తనకు కొడుకు పుట్టినట్లు ఇన్ స్టా ద్వారా వెల్లడించింది ఇలియానా. తమ జీవితాల్లోకి బాబును ఆహ్వానిస్తున్నట్లు..ఇది తన జీవితంలో మర్చిపోలేని ఆనందకర సందర్భమని ఇలియానా పేర్కొంది. బాబు ఫొటోను షేర్ చేసింది.

గత కొంతకాలంగా తాను డేటింగ్ లో ఉన్నట్లు చెప్పిన ఇలియానా…లైఫ్ పార్టనర్ ఎవరో చెప్పలేదు. ఆ విషయాన్ని దాస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవడంతో ఇటీవల అతనితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఈ జంట లైఫ్ లోకి తాజాగా వారసుడు వచ్చేశాడు. అతనికి కోయ ఫోనిక్స్ డాలన్ అనే పేరును పెట్టుకుంది ఇలియానా. ఈ స్టార్ హీరోయిన్ కు విశెస్ చెబుతున్నారు ఆమె అభిమానులు, ఇండస్ట్రీ సహచరులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *