గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ దేవర. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుథ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేవర సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఈ కథ పై కొరటాల చాన్నాళ్లు కసరత్తు చేశారు. ఆచార్య సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఈసారి బ్లాక్ బస్టర్ సాధించాలని కసితో వర్క్ చేస్తున్నాడు. ఇటీవల ఎన్టీఆర్, విలన్ సైఫ్ ఆలీఖాన్ లపై యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు.

ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న సైఫ్ ఆలీఖాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ నెల 16న సైఫ్ ఆలీఖాన్ బర్త్ డే. ఆ రోజున దేవర నుంచి సైఫ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఇప్పటి వరకు ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ లపై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగా వచ్చాయని టీమ్ మెంబర్స్ చెబుతున్నారు. నవంబర్ కి ఈ చిత్రాన్ని పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఏప్రిల్ 5న ఈ భారీ పాన్ ఇండియా మూవీ దేవర విడుదల కానుంది. మరి.. ఎన్టీఆర్, కొరటాల కలిసి మరోసారి బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *