హిందీ సహా సౌత్ లోని అన్ని భాషల్లో చంద్రముఖి కథ సాధించిన సక్సెస్ మనకు తెలుసు. ఈ సినిమాకు అనేక సీక్వెల్స్, ప్రీక్వెల్స్ వచ్చాయి. లారెన్స్ హీరోగా దర్శకుడు పి.వాసు చంద్రముఖి 2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె ఫస్ట్ లుక్ ను ఇవాళ రిలీజ్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇవాళ కంగనా ఫస్ట్ లుక్ రిలీజ్ తో పాటు సినిమా రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. చంద్రముఖి 2 చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు మరోసారి ప్రకటించారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా..వడివేలు కీలక పాత్రను పోషిస్తున్నారు. గత చిత్రం చంద్రముఖిలోనూ వడివేలు క్యారెక్టర్ సినిమా విజయంలో కీలకమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *