ఓ వైపు విభిన్న పాత్రలు పోషిస్తూ.. మరో వైపు వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కిస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న డైరెక్టర్ సముద్రఖని. పవర్ స్టార్ వపన్ కళ్యాణ్‌, మెగా హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో సముద్రఖని రూపొందించిన బ్రో సినిమా ఇటీవల విడుదలైంది. ఈ చిత్రానికి మొదటి మూడు రోజులు దాదాపు 100 కోట్లు కలెక్షన్స్ వచ్చింది కానీ.. ఆతర్వాత ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అయినప్పటికీ విజయయాత్ర అంటూ బ్రో టీమ్ తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సముద్రఖని తాజాగా ఓ ఇంటర్ వ్యూలో మెగా హీరోలు రామ్ చరణ్‌, అల్లు అర్జున్ లపై ప్రశంసలు కురిపంచాడు. ఇంతకీ ఏం చెప్పాడంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలో చరణ్, తాను స్నేహితులమయ్యామని… చరణ్‌ను కుమారుడిలా భావిస్తానని అన్నారు. తనని బాబాయ్ అని పిలిచేవాడని.. సొంత కొడుకులా భావిస్తానని.. శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్‌’ సినిమాలోనూ చరణ్‌తో కలిసి నటిస్తున్నానని చెప్పారు. ఇక అల్లు అర్జున్ గురించి చెబుతూ.. అందరితోనూ ప్రేమగా ఉంటారని చెప్పారు. అల.. వైకుంఠపురములో బన్నీతో కలిసి నటించానని.. బన్నీను తాను అన్భు అర్జున్ అని పిలుస్తానని అన్నారు. అన్బు అంటే.. ప్రేమ అని అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ బంగారం లాంటివాడు అంటూ ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *