మా దయా వెబ్ సిరీస్ ను ఒక సినిమాలా ఆపకుండా 3 గంటలు ప్రతి ఎపిసోడ్ చూసేస్తారు అని డైరెక్టర్ పవన్ సాధినేని సినిమా ప్రీ రిలీజ్ లో చెప్పిన మాటలు పబ్లిసిటీ కోసమని అనుకున్న వాళ్లు…కాదు అయన చెప్పింది నిజమేనని దయా స్ట్రీమింగ్ మొదలయ్యాక ఒప్పుకుంటున్నారు. దయా వెబ్ సిరీస్ ను అంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, మొత్తం సిరీస్ ఆపకుండా చూసేంత ఇంట్రెస్టింగ్ తెరకెక్కించారు పవన్. ఇప్పుడు ఆయన పేరు ఇటు ప్రేక్షకులతో పాటు అటు ఇండస్ట్రీలోనూ బాగా వినిపిస్తోంది. దయా వెబ్ సిరీస్ తో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారని చెప్పుకోవచ్చు.

షార్ట్ ఫిలింస్ నుంచి బిగ్ స్క్రీన్ దాకా ఒక అన్ స్టాపబుల్ జర్నీ చేస్తున్నారు డైరెక్టర్ పవన్ సాధినేని. సక్సెస్ ఫెయిల్యూర్స్ కు అతీతంగా ఆయన జర్నీ సాగుతోంది. అయితే ఇటీవల సేనాపతి సూపర్ హిట్ తర్వాత మరింత కాన్ఫిడెన్స్ తో పవన్ రూపొందించిన దయా కూడా ఘన విజయం సాధించింది. దీంతో పవన్ టాలెంట్ మరోసారి ప్రూవ్ అయ్యింది. దయాకు మీడియా నుంచి, ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రేజ్ లో మరిన్ని సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు పవన్ సాధినేని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *