వస్తుంటుంది. ప్రస్తుతం మహేశ్ నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి కూడా ఒక అప్ డేట్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ విషయంలో ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి మూవీ టీమ్ ముందునుంచే దీనిమీద ప్లాన్స్ చేస్తోంది. మహేశ్ పుట్టినరోజున గుంటూరు కారం నుంచి ఓ పాటను రిలీజ్ చేయబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ సమాచారం. ఈ పాట రికార్డింగ్ పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటను ఒకసారి మహేశ్ కు వినిపించి…ఆయన ఓకే అంటే రిలీజ్ చేస్తారట. టీజర్, ట్రైలర్ అంటే కొన్ని అభ్యంతరాలు, కరెక్షన్స్ ఉంటాయి కానీ పాట విషయంలో మహేశ్ కూడా పెద్దగా అబ్జెక్షన్స్ చెప్పకపోవచ్చు. కాబట్టి గుంటూరు కారం నుంచి పాటనే విడుదల చేయబోతున్నట్లు టాక్.

ఇక మహేశ్ డెైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ మూవీ అప్ డేట్ కూడా ఉంటుందట. ఈ సినిమాను ఈ నెల 9న మహేశ్ బర్త్ డే సందర్భంగా ఫార్మల్ గా అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభిస్తారు. ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ కే ఏడాదిన్నర టైమ్ పట్టేలా ఉంది. ఆలోగా మహేశ్ తన కొత్త సినిమాలు,ఇతర యాడ్ షూట్స్ కంప్లీట్ చేస్తాడు. ఏమైనా ఈ రెండు అప్ డేట్స్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *