పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ సలార్. ఇందులో ప్రభాస్ కు జంటగా శృతిహాసన్ నటించింది. బాహుబలి హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో సలార్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల టీజర్ రిలీజ్ చేస్తే.. అనూహ్య స్పందన వచ్చింది. ఈ నెలలో ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న సలార్ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. దీంతో సలార్ ఏ రేంజ్ సక్సెస్ సాధించనుంది అనేది ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే.. సలార్ చిత్రాన్ని ఇంగ్లీషు భాషలో కూడా రిలీజ్ చేసేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే పని మొదలుపెట్టినట్లు సమాచారం. ఇంగ్లీష్ లో డబ్ చేస్తే ప్రపంచ వ్యాప్తంగా మరింత మార్కెట్ పొందొచ్చు అనేది భావన. అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ కి కూడా అనుకూలంగా ఉంటుంది. పైగా, ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఇంగ్లీష్ డైలాగులు ఎక్కువే ఉంటాయి. కాబట్టి ఆయన సినిమాలను సులువుగానే ఇంగ్లీష్ లో అనువదించొచ్చు. అంటే.. పాన్ ఇండియా మూవీని కాస్తా.. పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేయనున్నారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు సెప్టెంబర్ 28 వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *