నటీనటులు – జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్, జోష్ రవి తదితరులు

టెక్నీకల్ టీమ్ – సినిమాటోగ్రఫీ – వివేక్ కాలేపు, సంగీతం- శ్రావణ్ భరద్వాజ్, ఎడిటింగ్ – విప్లవ్, నిర్మాణ సంస్థ – ఎస్ వీఎఫ్, నిర్మాతలు –
శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని, రచన దర్శకత్వం – పవన్ సాధినేని

ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన వెబ్ సిరీస్ దయా. ఈ వెబ్ సిరీస్ కు చేసిన ప్రమోషన్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అటు సోషల్ మీడియాలోనూ దయా కంటెంట్ వైరల్ అయ్యింది. వెయిటింగ్ కు పుల్ స్టాప్ పెడుతూ దయా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథేంటంటే

దయా (జేడీ చక్రవర్తి) ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్. మహాప్రస్థానానికి చనిపోయిన వారిని తీసుకెళ్తుంటాడు. అతనికి భార్య అలివేలు (ఈషా రెబ్బా) ఉంటుంది. ఆమె ప్రెగ్నంట్. ఒక రోజు దయా ఫ్రీజర్ వ్యాన్ లో డెడ్ బాడీ దొరుకుతుంది. ఇది చూసి షాక్ కు గురైన దయా…ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక తన అసిస్టెంట్ ప్రభ (జోష్ రవి ) హెల్ప్ తీసుకుంటాడు. ఆ బాడీ ప్రముఖ జర్నలిస్ట్ కవితది అని వారికి తెలుస్తుంది. ఆ పరిస్థితుల్లో దయా ఏం చేశాడు. ఈ ఇన్సిడెంట్ అతని జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది మిగిలిన కథ.

రివ్యూ

దయా వెబ్ సిరీస్ ప్రారంభం నుంచి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ సాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగే దయా జీవితంలో అనూహ్యంగా వచ్చి పడే ఈ సంఘటన కల్లోల్లాన్ని రేపుతుంది. ఎపిసోడ్స్ పెరుగుతూ ఉంటే కథలోని థ్రిల్ కూడా పెరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ లోని ప్రత్యేకత, బలం ఏంటంటే…ప్రతి పాత్రను యూనిక్ గా డిజైన్ చేశారు. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, కమల్ కామరాజు, రమ్య నంబీశన్, జోష్ రవి..ఇలా ప్రతి ఒక్క పాత్ర కథలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఏం జరిగి ఉంటుంది అనేది ప్రేక్షకుల ఊహకు అందకుండా సాగుతుంది.

ఒక పర్పెక్ట్ థ్రిల్లర్ సినిమాకు కావాల్సినంత బలమైన కథను దర్శకుడు పవన్ రాసుకున్నాడు. నటీనటుల్లో జేడీ చక్రవర్తి సహా ప్రతి ఒక్కరి పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. పవన్ దయా కథకు రాసుకున్న స్క్రీన్ ప్లే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎక్స్ లెంట్ గా ఉంది.

సెకండ్ సీజన్ కు కావాల్సినంత విషయాన్ని మిగిల్చే ఉంచారు. దయా సెకండ్ సీజన్ ఇంకెంత బాగుంటుందో అనేది ఫస్ట్ సీజన్ చూసిన వాళ్లు ఊహించుకోవచ్చు. వివేక్ సినిమాటోగ్రఫీ, శ్రావణ్ భరద్వాజ్ సంగీతం దయా వెబ్ సిరీస్ కు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. జేడీ చక్రవర్తి డిజిటల్ డెబ్యూ సూపర్ హిట్టయ్యింది. ఇక దర్శకుడు పవన్ మరోసారి తన టాలెంట్ ను దయాతో ప్రూవ్ చేసుకున్నారు. మంచి మంచి వెబ్ సిరీస్ లు అందిస్తున్న హాట్ స్టార్ లో దయా మరో సూపర్ హిట్ వెబ్ సిరీస్ గా మారే అవకాశాలున్నాయి.

రేటింగ్ 3.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *